రన్ వే పై స్కిడ్ అయి.. నదిలోకి దూసుకెళ్లిన విమానం..!

-

136 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం క్యూబా నుంచి బయలుదేరింది. మియామి ఎయిర్ ఇంటర్నేషన్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం అది. జాక్సన్ విల్లే లోని నావల్ ఎయిర్ స్టేషన్ లో ఉన్న రన్ వే వద్ద దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది.

యూఎస్ లోని ఫ్లొరిడాలో ఓ విమానం రన్ వే పై స్కిడ్ అయి నేరుగా నదిలోకి దూసుకెళ్లింది. విమానం ల్యాండ్ అవుతుండగా అదుపుతప్పిన బోయింగ్ 737 కమర్షియల్ జెట్ నదిలోకి దూసుకెళ్లింది. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదు.

136 మంది ప్రయాణికులతో వెళ్తున్న బోయింగ్ విమానం క్యూబా నుంచి బయలుదేరింది. మియామి ఎయిర్ ఇంటర్నేషన్ సంస్థకు చెందిన బోయింగ్ విమానం అది.

జాక్సన్ విల్లే లోని నావల్ ఎయిర్ స్టేషన్ లో ఉన్న రన్ వే వద్ద దిగుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. రన్ వే పక్కనే ఉన్న సెయింట్ జాన్స్ నదిలోకి దూసుకెళ్లింది. అయితే.. నదిలో లోతు తక్కువగా ఉండటంతో విమానం మొత్తం మునగలేదు. దీంతో ప్రయాణికులు తమ ప్రాణాలను కాపాడుకోగలిగారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన రెస్క్యూ టీం.. విమానంలోని ప్రయాణికులను సురక్షితంగా కాపాడింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version