ఏపీ మాజీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడిగా పేరున్న జీఎస్టీ సూపర్డెంట్ బొల్లినేని శ్రీనివాస్ గాంధీ పై సిబిఐ కేసు నమోదయింది. ఐదు కోట్ల రూపాయలు లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బొల్లినేని శ్రీనివాస గాంధీ మీద సీబీఐ కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. ఈ కేసులో మరో అధికారి చిలక సుధారాణి పై కూడా కేసు నమోదు అయింది. గతంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారిగా ఉన్న బొల్లినేని శ్రీనివాస్ కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వంటి హై ప్రొఫైల్ కేసులను విచారణ చేసినట్టు చెబుతున్నారు.
ఈడీ నుండి జిఎస్టికి బదిలీ అయిన తర్వాత ఐదు కోట్ల రూపాయలు లంచం కేసులో కేసు నమోదు చేసిన సీబీఐ, విజయవాడ హైదరాబాదు లో సోదాలు చేసింది. ఇన్ఫినిటీ మెటల్ ప్రోడక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ దాని అనుబంధ గ్రూప్ సంస్థలు ఇన్ పుట్ టాక్స్ క్రెడిట్ వ్యవహారంలో బొల్లినేని శ్రీనివాస్ గాంధీ ఐదు కోట్లు లంచం డిమాండ్ చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. బొల్లినేనితో పాటు చిలకా సుధారాణిని సైతం అధికారులు సస్పెండ్ చేసినట్టు చెబుతున్నారు.