మార్వెల్ మూవీస్ కంటే  RRR బెటర్.. ఆస్కార్‌కు నామినేట్ గ్యారంటీ..బాలీవుడ్ డైరెక్టర్

-

టాలీవుడ్ జక్కన్న, దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన విజ్యువల్ వండర్ RRR..ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో అందరికీ తెలుసు. బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ అయిన రామ్ చరణ్, తారక్ ఈ సినిమాలో నటించగా, ఈ పిక్చర్ తర్వాత వారు పాన్ ఇండియా స్టార్స్ అయిపోయారు. తాజాగా ఈ సినిమా కు ఆస్కార్ కు నామినేట్ అవుతుందంటూ బాలీవుడ్ డైరెక్టర్ ఒకరు కామెంట్స్ చేశారు.

బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ కాంబోలో వచ్చిన ‘దోబారా’ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా ఈ మేరకు అనురాగ్ కశ్యప్ మాట్లాడారు. పశ్చిమ దేశాల ప్రజలు RRRను బాగా చూస్తున్నారని, ఈ పిక్చర్ ను భారత సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తే ఆస్కార్ అవార్డ్స్ కు నామినేట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు.

హాలీవుడ్ జనాలు ఈ ఫిల్మ్ ను ప్రేమిస్తున్నారని వివరించారు డైరెక్టర్ అనురాగ్ కశ్యప్. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను RRR పెంచిందని ఇప్పటికే చాలా మంది బాలీవుడ్ ప్రముఖులు చెప్పారు. ఈ క్రమంలోనే అనురాగ్ కశ్యప్ ఆస్కార్ అవార్డుల గురించి మాట్లాడటం చర్చనీయాంశమవుతున్నది.

పశ్చిమ దేశాల ప్రజలతో తాను మాట్లాడిన క్రమంలోనే ఈ మేరకు వ్యాఖ్యానిస్తున్నానని అనురాగ్ కశ్యప్ తెలిపారు. మార్వెల్ మూవీస్ కంటే బెటర్ గా RRR ఉందని వారు చెప్తున్నారని, యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు డ్యాన్స్ కొరియోగ్రఫీ జనాలకు విపరీతంగా నచ్చిందని చెప్పారు. చూడాలి మరి.. RRR ఆస్కార్ బరిలో నిలిపేందుకు భారత సెలక్షన్ కమిటీ ఏ మేరకు ప్రయత్నాలు చేస్తుందో..

 

Read more RELATED
Recommended to you

Exit mobile version