పుష్ప2 దెబ్బకి బాలీవుడ్ స్టార్ మూవీ వాయిదా

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. సరికొత్తగా అల్లు అర్జున్ మాస్ గెటప్ అదిరిపోయింది. దీంతో టాలీవుడ్ నుంచే కాకుండా బాలీవుడ్ నుండి కూడా ఈ టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. పుష్ప బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.ఇప్పుడు పుష్ప 2పై కూడా హైప్ క్రియేట్ అవుతోంది. దాంతో.. పుష్ప 2 సినిమాకుక్ పోటీగా వచ్చేందుకు కూడా బాలీవుడ్ హీరోస్ కూడా బాగా ఆలోచిస్తున్నారట.

బాలీవుడ్ స్టార్ అజయ్ దేవ్ గణ్, రణ్వీర్ సింగ్,అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ వంటి టాప్ హీరోలతో దర్శకుడు రోహిత్ శెట్టి సింగం అగైన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో కరీనా కపూర్, దీపికా పదుకొనె హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ముందుగా ఆగస్టు 15న ఈ సినిమాని విడుదల చేయాలనీ అనుకున్నారట మేకర్స్. కానీ, అదే రోజు అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ కానుంది.దేశవ్యాప్తంగా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ దృష్ట్యా సింగం అగైన్ సినిమాను వాయిదా వేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version