ర‌జ‌నీకాంత్‌కు బాంబ్ బెదిరింపు.. పోలీసుల సెర్చ్ ఆప‌రేష‌న్‌..

-

త‌మిళ సూపర్ స్టార్ ర‌జ‌నీకాంత్‌కు బాంబు బెదిరింపు కాల్ వ‌చ్చింది. ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆయ‌న‌కు ఫోన్ చేశారు. చెన్నైలోని ఆయ‌న నివాసంలో బాంబు పెట్టామ‌ని కాల్ రావ‌డంతో ఒక్క‌సారిగా అక్క‌డ అల‌జ‌డి చెల‌రేగింది. దీంతో స‌మాచారం అందుకున్న చెన్నై పోలీసులు ర‌జ‌నీ ఇంట్లో సెర్చ్ ఆప‌రేష‌న్ చేప‌ట్టారు.

అయితే విష‌యం తెలుసుకున్న ర‌జ‌నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఆయ‌న నివాసం వ‌ద్ద‌కు చేరుకున్నారు. మ‌రోవైపు పోలీసులు ఆయ‌న నివాసంలో బాంబు డిటెక్ట‌ర్లు, స్నిఫ‌ర్ డాగ్స్‌తో విస్తృతంగా త‌నిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ర‌జినీ నివాసంలోని గార్డెన్‌లో ఎక్కువ‌గా సెర్చ్ చేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతానికి ర‌జ‌నీ ఇంట్లో ఎలాంటి బాంబు లేద‌ని పోలీసులు తేల్చారు. కానీ బాంబు కోసం గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు వెల్ల‌డించారు. ఇది కేవ‌లం బెదిరింపు కాల్ మాత్ర‌మే అయి ఉంటుంద‌ని వారు భావిస్తున్నారు.

కాగా ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం పేట‌ 2 సినిమా కోసం కార్తీక్ సుబ్బ‌రాజ్‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నార‌ని తెలిసింది. ఆ సినిమా క‌థ ఇంకా రెడీ కాక‌పోయినా సినిమా మాత్రం క‌చ్చితంగా మొద‌ల‌వుతుంద‌ని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version