వరంగల్ కోర్టుకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. కోర్టు పరిసరాల్లో జాగిలాలతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపడుతోంది. కోర్టు ప్రాంగణంతో పాటు అందులోని గదుల్లోనూ క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు.
ఎలాంటి పేలుడు పదార్థాలు లేకపోవడంతో కోర్టు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒక్క క్షణం డాగ్ స్వ్కాడ్ రావడంతో కోర్టులో ఉన్న లాయర్లు, న్యాయమూర్తులు, అర్జిదారులు భయభ్రాంతులకు గురయ్యారు. మొత్తానికి బాంబు బెదిరింపులు ఫేక్ అని తేలడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కాగా, బెదిరింపు కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు చేశారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు.