70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు ఏంటి ? : బోండా ఉమ

-

70 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టారు.. ఇది అధికార దుర్వినియోగం కాదా..? అని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వం చేసే తప్పుడు విధానాలకు అధికారులు సహకరిస్తే.. తగిన మూల్యం చెల్లించుకుంటారని.. జగన్.. మా ఇంటి గోడలు పడగొడుతున్నావ్.. తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదులుతున్నాయి గుర్తుంచుకో అని హెచ్చరించారు.

తన ఇంటి పునాదులు కదులుతుండడంతో జగన్ టీడీపీ నేతల ఇళ్లని కూలుస్తున్నారని.. జగన్ పాలనే ప్రజావేదిక కూల్చివేతలతో మొదలైందన్నారు. జగన్.. ఇవాళ నీది.. రేపు మాదని.. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటనతో ప్రభుత్వం ఉలిక్కిపడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనాన్ని చూసి జగన్ ఓర్వలేక టీడీపీ నేతల ఇంటి గోడలను కూలుస్తున్నారని.. ఆ ఓర్వలేనితనంతోనే అయ్యన్న ఇంటి గోడను కూల్చారన్నారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు కాల్చి చంపుతానని జగన్ ఆనాడు కామెంట్లు చేశారని.. ఇప్పుడు గుట్కా గాడు, కొబ్బరి చిప్పలగాడు మాట్లాడిన మాటలు సంగతేంటీ..? అని నిలదీశారు. కొబ్బరి చిప్పల నాయకుడు వెలంపల్లి అవినీతిని ప్రశ్నిస్తే ఓ సామాన్యుడ్ని అరెస్ట్ చేయిస్తారా..? ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు…ఎన్ని రకాలుగా మమ్మల్ని అణిచేసే ప్రయత్నం చేసినా మేం తగ్గమన్నారు. రేపట్నుంచి ఇంతకు పదింతలు మాట్లాడతామని హెచ్చరించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version