కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని నమ్మడం లేదు : మాజీ ఎంపీ

-

ఢిల్లీ జపం, మోడీ జపం చేయకుంటే రేవంత్ రెడ్డి కి నిద్ర రావడం లేదు.. అన్ని రంగాల్లో వైఫల్యం చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ నేత.. మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారా.. ప్రతి పక్షంలో ఉన్నారా మర్చిపోయినట్టు ఉన్నారు. ఆయనది 5D పాలన…1D డైవర్షన్ … 2D డెమాలిషన్… 3D డిస్ట్రక్షన్… 4D డిసీవింగ్… 5D.. ఢిల్లి బ్లేమ్ గేమ్. 420 రోజుల్లో 40 సార్లు డిల్లీకి వెళ్ళారు.

ఆయనకు ఢిల్లీ గాలి, మోడీ మందు బాగా పడినట్టు ఉంది. కాంగ్రెస్ రేవంత్ ని నమ్మడం లేదు.. రేవంత్ కాంగ్రెస్ ను నమ్మడం లేదు. మీనాక్షి నటరాజన్ సూపర్ సీఎం. ఢిల్లీ నుండి ఏమీ వచ్చిందో చర్చించేందుకు మా నాయకులు ఎందుకు నేను సిద్దం. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ 70 సంవత్సరాలు పై బడిన వారికి అమలు కాకుండా సైంధవుడులా అడ్డం పడుతుంది రేవంత్ రెడ్డి కాదా.. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లో రాష్ట్ర వాటా చెల్లించక పోవడం తో చాలా ప్రాజెక్ట్ లు పెండింగ్ లో ఉన్నాయి అని నర్సయ్య గౌడ్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version