ఫిబ్రవరి 5వ తేదీ తర్వాత ఏపీ ఉద్యోగుల ఉద్యమం ఉంటుందని హెచ్చరించారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫిట్మెంట్ తగ్గించిన దాఖలాలు లేవు..కొందరు నాయకులు ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. జనంలో మమ్మల్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఫిబ్రవరి 5వ తేదీలోపు ఉద్యోగుల డిమాండ్లు ప్రభుత్వం పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీతభత్యాలు పెండింగ్ డిఏలు ఎప్పుడు ఇస్తారు..దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఫిట్మెంట్ తగ్గించిన దాఖలాలు లేవని విమర్శలు చేశారు. సీఎం జగన్ చెప్పినట్టు బకాయిలు ఇవ్వలేదు..గౌరవంగా తమకు రావాల్సిన బకాయిలని అడుగుతున్నామని చెప్పారు. వేరే రాష్ట్రాల్లో మాత్రం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తున్నారు..కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్నారు.. ఏమైందని నిలదీశారు ఏపీ రెవెన్యూ ఉద్యోగుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు.