ముఖంపై ముడతలకు బొటాక్స్‌ ఇంజక్షన్‌.. నిజంగా పోతాయా..?

-

ప్రకృతికి విరుద్ధంగా వెళ్లంలే అని ఒకప్పటి మాట..కానీ టెక్నాలజీ దాన్ని నిజం కాదని చేసి చూపిస్తుంది. 40 ఏళ్లకు రావాల్సిన ముడతలను 60 అయినా రాకుండా.. మెయింటేన్‌ చేస్తున్న వాళ్లు ఉన్నారు.. అందం అంటే..ఆడవాళ్లకు అయినా, మగవాళ్లకు అయినా ఇంట్రస్ట్‌ ఉంటుంది. అందంగా ఉండాలని అందరూ అనుకుంటారు. మీకు ముఖం ముడతలు వచ్చే టైమ్‌ ఆసన్నమయిందా..? ఇప్పటికే వచ్చేశాయని చింతిస్తున్నారా.. ఈ ముడతలను మడతపెట్టేసే చికిత్సలు ఇప్పుడు చాలా ఉన్నాయి..అందులో ఒకటి బొటాక్స్ ఇంజక్షన్. ముఖంపై ముడతలు తగ్గించేందుకు ప్రధానంగా బొటాక్స్ ఇంజక్షన్ వాడుతుంటారు. అయితే నిజంగా ఇవి ముడతలను తగ్గిస్తాయా..? ఇవి వాడటం ఎంత వరకూ మంచిది.. ఏమైనా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయా..?

 

బొటాక్స్ ఇంజెక్షన్‌ ఎలా పనిచేస్తుంది..?

ముఖం మీద ముడతలను తొలగించడానికి బొటాక్స్ ఇంజెక్షన్లు(Botox Injections) అందుబాటులో ఉన్నాయి. బొటాక్స్ అనేది ఒక టాక్సిన్, ఇది ఇంజెక్షన్ ద్వారా కండరాలను తాత్కాలికంగా స్తంభింపజేస్తుంది. దీని కారణంగా, ఈ ఇంజెక్షన్ ఇచ్చిన ప్రదేశంలో మీ శరీర కండరాల కార్యకలాపాలు తక్కువగా ఉంటాయి. అధిక కండరాల చర్య సాధారణంగా ముడతలకు దారితీస్తుంది. బొటాక్స్‌ను ముఖంలో ముడుతలకు ఇంజెక్ట్ చేసినప్పుడు, ఇది ముఖ మైమెటిక్ కండరాల కార్యకలాపాలను తగ్గిస్తుంది. ఇది ముడతల అభివృద్ధిని ఆపుతుంది.

శాశ్వత పరిష్కారం ఇస్తుందా..?

ఈ వినూత్నమైన కొత్త ఇంజెక్షన్లు తాత్కాలిక అందాన్ని అందిస్తాయి. కానీ ఇలాంటి ట్రీట్‌మెంట్లు అతిగా చేయడం వల్ల తాత్కాలిక ఫలితాలు రావడం వల్ల మీ చర్మంపై చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఆరోగ్య సమస్యలకు విముక్తి కలిగించేందుకు ముఖంపై ఇచ్చే ఈ ఇంజక్షన్.. ఖరీదు వేలల్లో ఉంటుంది.

విష పదార్థమా..?

ఇది నిజానికి బోట్యులైనమ్ టాక్సిన్ అనే విషపూరితమైన పదార్థం. కొంత బోట్యులైనమ్ టాక్సిన్ అనేది చాలా మందిని చంపేయగలదట. ముఖంపై ముడతలు తగ్గించేందుకు ప్రధానంగా బొటాక్స్ ఇంజక్షన్ తీసుకుంటారు. అయితే చర్మం ముడతలు పడటానికి కారణమైన ధమనులను ఇది నాశనం చేస్తుంది. బొటాక్స్ ఇంజక్షన్.. తక్కువ మోతాదులో ఇస్తారు. ఒక గ్రాములో కొన్ని కోట్ల వంతు బొటాక్స్‌ను సలైన్‌లో కలిపి ఇంజక్షన్ రూపంలో ఎక్కిస్తారు. అయితే దీని ద్వారా కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి..ఈ చికిత్స చేసుకోవాలనుకునే వాళ్లు కాస్త ఆలోచించితే బెటర్..!

Read more RELATED
Recommended to you

Exit mobile version