టీడీపీని నిషేధించాలని ఈసీపీ కోరతాం : బొత్స

-

నిన్న టీడీపీ పార్టీ కార్యాలయాలపై దాడి నేపథ్యంలో ఏపీ రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి. ఈ ఘటనతో వైసీపీ మరియు టీడీపీ నేతల మధ్య పరస్పర మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ నిప్పులు చెరిగారు.
టీడీపీ నిషేధించాలని ఈసీపీ కోరతామని బొత్స సత్య నారాయణ అన్నారు.

చంద్రబాబు నాయుడు నీచమైన రాజకీయాలు చేస్తున్నారని… టీడీపీ నేతల భాషనున పవన్‌ ఎందుకు ఖండించలేదని ఫైర్‌ అయ్యారు. టీడీపీ నేతలు నోరు అదుపు లో పెట్టుకోవాలని.. హెచ్చరించారు. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ , చంద్రబాబు కలిసి ప్లాన్‌ ప్రకారమే ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో అశాంతి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బొత్స సత్య నారాయణ. చంద్రబాబు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి బొత్స డిమాండ్‌ చేశారు. ప్రజా స్వామ్యం లో ఇలాంటి చర్యలు తగవన్నారు. కాగా ఇవాళ ఏపీ టీడీపీ బంద్‌ కు పిలుపు నిచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version