బొత్స రూటు మార్చాడ్రా?  

-

రాజ‌కీయంలో అనూహ్య ప‌రిణామాలే ఎక్కువగా జ‌రుగుతుంటాయి అనేందుకు తాజా ఉదంతాలే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌లు.బొత్స చెప్పిన ప్ర‌కారం వైసీపీ అనుకున్న విధంగా అనుకున్న ప‌ద్ధతిలో గ్రామాల్లో విద్యుత్ కోత‌ల్లేవ‌ని నిరూపించ‌డం సులువు కూడా! కానీ వాస్త‌వాలు మాత్రంఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. అదేవిధంగా త‌ప్పుడు మాట‌లు తాను అన‌ను అని చెప్పి కూడా బొత్స త‌న స‌చ్ఛీలత నిరూపించుకోవ‌డం కూడా ఓ మంచి ప‌ద్ధ‌తే కానీ ఇందుకు విప‌క్షాలు ఏమంటాయో చూడాలిక‌!

ఎన్న‌డూ లేనిది త‌న స్నేహితుడు లాంటి అచ్చెన్న‌ను టార్గెట్ చేశాడు బొత్స.సాధార‌ణంగా  ఆయ‌నేమీ అన‌డు కానీ వైసీపీ పెద్ద‌ల ఆదేశానుసారం జ‌గ‌న‌న్న స‌ర్కారు ఇస్తున్న ఇళ్లు, అందిస్తున్న నిరంతరాయ విద్యుత్,అదేవిధంగా మ‌రికొన్ని విష‌యాల‌ను ప్ర‌స్తావిస్తూ ఇవాళ మీడియా మీట్ నిర్వ‌హించారు.వాస్త‌వానికి గ్రామాల్లో అన‌ధికార కోత‌లు ఉన్నాయ‌న్న‌ది టీడీపీ అంటుంటే,లేవ‌ని వైసీపీ అంటోంది.దీంతో  త‌గువు రోజురోజుకూ పెద్ద‌ద‌వుతోంది.ఎన్టీపీసీ తో చిన్న గ్యాప్ మాత్ర‌మే ఉంది కానీ దానిని చిలువ‌లు,ప‌లువలు చేసి చూపించాల్సిన ప‌నేమీ లేద‌ని కూడా అంటున్నారు బొత్స.

వాస్త‌వానికి అచ్చెన్న‌ను ఆయ‌న పెద్ద‌గా టార్గెట్ చేయ‌కున్నా ఈ రోజెందుకో కొన్ని  కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.త‌న‌తో వ‌స్తే వాస్త‌వాలు నిరూపిస్తాన‌ని అంటున్నారు. అదేవిధంగా టిడ్కో ఇళ్లు ల‌బ్ధిదారుల‌కు కేటాయిస్తామ‌ని, జ‌గ‌న‌న్న క‌ట్టించే ఇళ్లు పిచ్చుక గూళ్ల‌లా ఉన్నాయ‌ని అనడం కూడా స‌మంజ‌సం కాద‌ని అన్నారు. తాను త‌ప్పు మాట్లాడ‌న‌ని మాట్లాడాన‌ని నిరూపిస్తే త‌ల‌దించుకుంటాన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version