ఇళ్లపట్టాల పంపిణీ వాయిదా: అంతా నువ్వే చేశావు బాబు!

-

జగన్ తన ప్రభుత్వంలో తీసుకుంటున్న చాలా పథకాలు, చాలా విప్లవాత్మక మార్పులను అడ్డుకోవడంలో అసెంబ్లీలో బలం లేకపోయినా శాసనమండలిలో ఉన్న బలంతో వెనకా ముందూ చూడకుండా అడ్డుకుంటుంది టీడీపీ! అక్కడకూడా సాధ్యం కానిపక్షంలో కోర్టులను ఆశ్రయించి అడ్డుతగులుతున్నారని వైకాపా నేతలు ఆరోపిస్తుంటారు! అందులో ఇంగ్లిష్ మీడియం విషయం, మూడు రాజధానుల వ్యవహారం, సి.ఆర్.డి.ఎ బిల్లు వంటివి ఉన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదాకి కూడా బాబే కారణం అని చెబుతున్నారు ఏపీ మంత్రి.

అవును… జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదాపడటం పై రాష్ట్ర మున్సిపల్ – పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

జూలై 8న జరగాల్సిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం స్పందించిన బొత్స… చంద్రబాబు కుట్రపూరితంగా పేదలకు ఇళ్ల స్థలాలు దక్కకుండా కోర్టు స్టే ఆర్డర్లను తీసుకుని వచ్చారని ధ్వజమెత్తారు. ఇది చాలా మంది ఊహించనదే అయినా.. మంత్రి గారు చెప్పడతంతో శంకంలో పోసినట్లయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విష్యంలో మరింత ఫైరయిన బొత్స… ప్రతీ పేదవాడు చంద్రబాబు చేస్తున్న అన్యాయాన్ని గమనిస్తూనే ఉన్నారని… ఈ రోజు ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడవచ్చు కానీ ఆ ప్రక్రియ మాత్రం కచ్చితంగా చేసి తీరుతామని చెబుతున్నారు.

మొదట 25 లక్షలు అనుకున్నా, అదికాస్తా 30 లక్షలకు చేరిందని.. పేదలకు ఇళ్ళు స్థలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సిద్ధమయ్యారని.. ఇంత గొప్ప పథకం విషయంలో కూడా కోర్టులు నుంచి స్టే తీసుకువచ్చి టీడీపీ కుట్రలు చేస్తోందని మంత్రి బొత్స ధ్వజమెత్తారు!

Read more RELATED
Recommended to you

Exit mobile version