ఏపీలో అన్నా చెల్లెల రాజకీయం రసవత్తరంగా మారింది. వైసీపీ అధినేత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభలో సొంత చెల్లి వైఎస్ షర్మిల బట్టల పై సంచలన కామెంట్స్ చేశారు. పసుపు చీర కట్టుకుని చంద్రబాబు దగ్గరికి వెళ్లింది అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి సొంత చెల్లి బట్టల పై బహిరంగ సభలో ప్రస్తావించడం ఏంటని పలువురు విమర్శలు కురిపిస్తున్నారు మీ అమ్మ విజయమ్మ కూడా పసుపు చీర కట్టుకుంటే ఇలానే అంటారా అని అన్నారు.
పసుపు చీర కట్టుకుంటే తప్పేంటి పసుపు పైన చంద్రబాబునాయుడు కి ఏమైనా రైట్ ఉందా పచ్చ రంగుని నువ్వు కొనుక్కున్నావా అని అడిగారు. పసుపు అంటే మంగళకరమని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అన్నారని అందుకని మొదట్లో సాక్షి టీవీ కూడా పసుపు రంగులోనే ఉండేదని జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారా అని అంతా అన్నారు. తాజాగా ఈ అన్నాచెల్లెళ్ల గొడవ మీద బొత్స సత్యనారాయణ స్పందించారు. వైయస్ షర్మిల నిన్నటి వరకు సీఎం చెల్లి అని షర్మిల ప్రత్యర్థి పార్టీ నాయకురాలు అలాంటప్పుడు అన్నాచెల్లెల సంబంధాలు ఎలా ఉంటాయని అన్నారు. జగన్మోహన్ రెడ్డి తలకు పెట్టుకున్న బ్యాండేజ్ ఎప్పుడు తీయాలో డాక్టర్ చూసుకుంటారని బొత్స షర్మిల కి చురకలని అంటించారు.