పబ్ జీ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు మందలించడంతో మనస్థాపానికి గురై ఓ బాలుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన చిత్తూరు జిల్లా పలమనేరు శ్రీనర్ కాలనీలో చోటు చేసుకుంది. వివరాళ్లోకి వెళితే.. శ్రీనగర్ కాలనీకి చెందిన శ్యాంప్రసాద్(14) బాలుడు పబ్ జీ గేమ్ ఆడటానికి అలవాటు పడ్డాడు. అతని తల్లిదండ్రులు మందలించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శ్యాం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు గమనించి స్థానికంగా ఉన్న పలమనేరు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచాడు. శ్యాంప్రసాద్ మరణించడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తల్లిదండ్రులు శోఖ సంద్రంలో మునిగిపోయారు. ఆన్ లైన్ గేమ్స్, పబ్ జీ లాంటీ ఆటలు ఆడొద్దన్నంటుందుకు చాలా చోట్లల్లో యువకులు ఆత్మహత్యకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం పబ్ జీ లాంటి ఆన్ లైన్ గేమ్ లను పూర్తిగా నిషేధించాలని బాలుడి తల్లిదండ్రులు కోరుతున్నారు.