బాలుడినీ వదలని వైనం.. ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం..

-

కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. చిన్నా పెద్దా తేడాల లేకుండా ఆడవాళ్లపైనే కాకుండా మగవారిపై కూడా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఓ వ్యక్తిని తీవ్రంగా కొట్టారు గ్రామస్థులు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన నిందితుడు సోనార్​ బాబా(55) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని అహ్మద్​నగర్ జరిగింది. అంతకు ముందు నిందితుడిపై బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అసలేం జరిగిదంటే: బాధితుడు తన తల్లిని సోమవారం రాత్రి రూ.5 అడిగాడు.

ఆమె డబ్బులు ఇవ్వగా కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్లాడు. సుమారు 10 నుంచి 15 నిమిషాలైనా తన కుమారుడు ఇంటికి రాకపోయేసరికి ఆమె ఆందోళన చెందిది. సమీప ప్రాంతాల్లో వెతకటం ప్రారంభించింది. అంతలో మీ కొడుకును సోనార్ బాబా తన ఇంటికి తీసుకెళ్లాడని ఓ మహిళ చెప్పింది. దీంతో హుటాహుటిన సోనార్ ​బాబా ఇంటికి బాధితుని తల్లి వెళ్లింది. అప్పటికి బాబా.. బాలునిపై అఘాయిత్యం చేస్తున్నాడు. అప్పుడు మహిళ కేకలు వేయడం వల్ల స్థానికులు అక్కడికి చేరుకుని బాబాను చితక్కొట్టారు. ఈ దాడిలో నిందితుడికి తీవ్ర గాయాలవ్వగా..జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version