Ritu Varma : పరువాల విందు చేసిన పెళ్లి చూపులు హీరోయిన్ !

-

హీరోయిన్ పక్కన ఫ్రెండ్ క్యారెక్టర్ నుంచి హీరోయిన్ గా ఎదిగారు రితూ వర్మ. తాజాగా తన లేటెస్ట్ పిక్స్ తో అమ్మడు అదరగొడుతోంది. ఎద అందాలు, నడుము ఒంపులతో సరికొత్తగా రితూ వర్మను చూపిస్తోంది.

పర్‌ పుల్‌ కలర్ డ్రెస్‌ లో హంగామా చేస్తోంది ఈ బ్యూటీ. కనిపించి కనిపించని అందాలతో కనువిందు చేస్తోంది. కుర్రాళ్ల మతులు పోగొడుతోంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. నెటిజెన్లు హాట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఎక్కువగా స్కిన్ షో చేయకుండా.. సంప్రాదాయంగా ఉండే కొంతమంది హీరోయిన్లలో రితూ వర్మ ఒకరు. బాద్ షా సినిమాలో కాజల్ అగర్వాల్ పక్కన నటించిన ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు హీరోయిన్ గా నటించిన సినిమాల్లో ఎక్కడా గ్లామర్ షో చేయలేదు. డీసెంట్ పాత్రల్లో ఆకట్టుకుంటోంది.

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన రితూ వర్మకు… విజయ్ దేవర కొండతో చేసిన ‘ పెళ్లి చూపులు’ సినిమా ద్వారా గుర్తింపు వచ్చింది. ఆ తరువాత తెలుగుతో పాటు తమిళ భాషల్లో పలు భాషల్లో నటించింది. ధనుష్ పక్కన వీఐపీ 2లో నటించింది.

నానితో చేసిన ‘టక్ జగదీష్’ నిరుత్సాహ పరిచినా.. ఇటీవల ‘ వరుడు కావలెను’ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టింది. ప్రస్తుతం తెలుగు పాటు పలు తమిళ సినిమాల్లో రితూ వర్మ నటిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version