Boyapati RAPO : రామ్‌ – బోయపాటి మూవీ నుంచి బిగ్‌ అప్డేట్‌

-

టాలీవుడ్ ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎనర్జిటిక్ స్టార్ రామో పోతినేనితో తన నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఇస్మార్ట్ శంకర్’ ఫిల్మ్ తర్వాత రామ్…మాస్ హీరోగా అవతారమెత్తిన రామ్‌…ప్రస్తుతం మంచి హిట్‌ కోసం ఎదురు చూస్తున్నాడు.

ఇందులో భాగంగానే… ఈ పాన్ ఇండియా ఫిల్మ్ ను శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.9గా శ్రీనివాసా చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి.

తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల చేస్తామని చెప్పారు. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. ఈ సినిమా నుంచి ఓ అప్టేట్‌ ను దసరా రోజున ఇస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ ను రిలీజ్‌ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version