అయితే తను కూడా వెరైటీగా హైదరాబాద్ వరదలపై కామెడీ చేయాలనుకున్నాడు నటుడు బ్రహ్మాజీ. ఇంకేముందు తనకు తోచినట్టుగా స్పందించి కామెడీ చేయాలనుకున్నాడు. తన ఇల్లు కూడా వరదల్లో మునిగిపోయిందని, కార్లు వరదలో తేలియాడుతున్నాయని ట్విట్టర్‌లో ఫొటోలు షేర్ చేసిన బ్రహ్మాజీ `ఇదీ మా ఇంటి పరిస్థితి. ఓ మోటారు బోటు కొనాలనుకుంటున్నా. దయచేసి మీకు తెలిసిన మంచి సడవ గురించి చెప్పండి` అని కామెడీ చేయబోయాడు.
అడ్డంగా బుక్కయ్యాడు. నగరంలో పరిస్థితి దారుణంగా వుంటే మీకు కామెడీ కావాల్సి వచ్చిందా? దఇవిసీమ ఉప్పెన.. కేరళ వరదలకు సహాయం చేసి నటీనటులు ముందు నిలిస్తే మీరు మాత్రం కామెడీ చేస్తారా అంటూ బ్రహ్మాజీని నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడేసుకుంటున్నారు. భారీ స్థాయిలో బ్రాహ్మాజీని ట్రోల్ చేస్తున్నారు.