బ్రేకింగ్ : బీజేపీ నుండి లంకా దినకర్ ని సస్పెండ్ చేసిన సోము

-

టీడీపీ నుండి బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున ఛానల్స్ లో బలమైన వాయిస్ వినిపిస్తున్నారు లంకా దినకర్. అయితే పార్టీ నియమాలకు‌ విరుద్ధంగా చర్చ ల్లో పాల్గొంటున్నారంటూ లంకా దినకర్ పై వేటు వేసింది ఏపీ బీజేపీ. బిజెపి నుంచి లంకా దినకర్ ని సస్పెండ్ చేసినట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోమువీరాజు ప్రకటించారు. బిజెపి ఆఫీస్ సెక్రటరీ శ్రీనివాసరావు పేరుతో దినకర్ కు సస్పెన్షన్ లేఖ పంపారు.

పార్టీ నిర్ణయాలు, నియమావళి, ఆదేశాలను ధిక్కరించినందుకు సస్పెండ్‌ చేశామని, పార్టీ విధానానికి, అభిప్రాయాలకు వ్యతిరేకంగా సొంత అజెండాతో ఆయన చర్చల్లో పాల్గొంటున్నారని సోము పేర్కొన్నారు. జులై 26 జరిగిన మీడియా చర్చలో పాల్గొన్నందుకు నోటీసులు ఇచ్చామని, అయితే సరైన వివరణ ఇవ్వని కారణముగా పార్టీ నుండి సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. గతంలో జారీచేసిన షోకాజ్‌ నోటీసుకు ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మళ్లీ టీవీ చర్చల్లో పాల్గొన్నాంటున్నారనే ఈ చర్య తీసుకున్నామని బీజేపీ చెబుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version