తమకు పిల్లలు లేకపోవడానికి గల కారణాలు చెప్పిన బ్రహ్మాజీ..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న బ్రహ్మాజీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. ఈయన కమెడియన్ గానే కాకుండా సహాయ నటుడుగా, నెగిటివ్ రోల్స్ కూడా చేసి మంచి మెసేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత జీవితం గురించి అలాగే తమకు పిల్లలు లేకపోవడానికి గల కారణాలు కూడా చెప్పారు.. ఆయన మాట్లాడుతూ శంకరాభరణం సినిమా వల్లే తాను నటుడిగా మారానని చెప్పుకొచ్చిన బ్రహ్మాజీ అందరిలాగా తాను ఎలాంటి కష్టాలు పడలేదు అని తెలిపారు.

ఇక బ్రహ్మాజీ మాట్లాడుతూ.. తూర్పుగోదావరి జిల్లా లో పుట్టాను .. పశ్చిమగోదావరి జిల్లాలో పెరిగాను. మా నాన్న తహసిల్దార్.. అప్పట్లో సీనియర్ నటుడు సోమయాజులు గారు కూడా ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు. ఆయన నటించిన శంకరాభరణం సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది.. ఆయనకు భారీగా సన్మానం కార్యక్రమం నిర్వహించారు.. అయితే సినిమాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ లభిస్తుందా అని అప్పుడే అనిపించింది.. ఎలాగైనా సరే సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని చదువు పూర్తయిన వెంటనే శిక్షణ తీసుకునే సమయంలో కృష్ణవంశీ, రవితేజ ,రాజా రవీంద్ర పలువురితో పరిచయాలు కూడా జరిగాయి. ఇక వాళ్లందరూ కూడా సినిమాల్లోకి రావడానికి ప్రయత్నాలు చేస్తున్న రోజులవి.. ఇక ఎన్నో సినిమాలలో నటించినా పది సంవత్సరాలపాటు నేను సంతృప్తి చెందే పాత్రలు దొరకలేదు అంటూ ఆయన వెల్లడించారు.

పిల్లలు లేరు అనే విషయంపై ఆయన స్పందిస్తూ.. బెంగాలీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న నేను.. పెళ్లి చేసుకునే సమయానికి ఆమె ఓ వ్యక్తి నుంచి విడాకులు కూడా తీసుకుంది.. చెన్నై లో ఉన్నప్పుడే ఆమెతో నాకు పరిచయం ఏర్పడింది.. ఇష్టపడి పెద్దలకు చెప్పి వివాహం చేసుకున్నాను. ఆమెను వివాహం చేసుకునే సమయానికి ఆమెకు ఓ బాబు కూడా ఉన్నాడు . బాబు ఉండగా మళ్లీ మాకు పిల్లలు ఎందుకు అనిపించింది.. అందుకే మేము పిల్లలు వద్దనుకున్నాము అంటూ ఆయన వెల్లడించారు. ఇక ఆయన ఎవరో కాదు.. పిట్టకథ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు అంటూ కూడా వెల్లడించారు బ్రహ్మాజీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version