దేవదాయ శాఖలోకి రెవెన్యూ సిబ్బంది..ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

-

అర్చకుల చేతుల్లో ఉన్న భూములకి సంబంధించిన పర్యవేక్షణ దేవదాయ శాఖదేనని.. అర్చకులు చేతుల్లో ఉన్న భూముల నుంచి వచ్చే ఫలసాయాన్ని వారు అనుభవించవచ్చు అని తెలిపారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ. దేవుడి మాన్యం భూములపై హక్కులు దేవదాయ శాఖదే.. దాని మీద ఫలసాయం పొందే అవకాశం మాత్రమే ఖాస్తుదారులకు ఉంటుందని.. నిబంధనల ప్రకారమే రెవెన్యూ శాఖ వారిని దేవదాయ శాఖలో తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

సీఎం జగన్

దేవదాయ శాఖలో ఉద్యోగుల కొరత ఉందని.. పరిపాలనా కోసం మాత్రమే రెవెన్యూ ఉద్యోగులను తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఐఏఎస్ అధికారులు.. రెవెన్యూ అధికారులు వచ్చినంత మాత్రాన శాస్త్ర ప్రకారం జరగదంటే ఎలా..? అని నిలదీశారు. రెవెన్యూ అధికారులు పరిపాలన చేస్తారు తప్ప.. నామం ఎలా పెట్టాలో చెప్పరు కదా..? 4.20 లక్షల ఎకరాల భూమి దేవదాయ శాఖ పరిధిలో ఉందని వివరించారు.

వీటిల్లో కొన్ని ఆక్రమణలు ఉన్నాయని.. దేవుడి మాన్యం భూముల్లో ఆక్రమణలను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆదేశంతో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశామని క్లారిటీ ఇచ్చారు దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.

Read more RELATED
Recommended to you

Exit mobile version