తెలంగాణలోని పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీ భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.
శ్రీ సీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నవాహ్నిక మహోత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు.ఈ క్రమంలోనే ఆలయంలోని స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం, విశేష స్నపనం, మృత్సంగ్రహణం, వాస్తు పూజలను పురోహితులు నిర్వహించనున్నారు. కాగా, ఉగాది పండుగ పర్వదినాన ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.