బ్రెజిల్‌లో రికార్డుస్థాయిలో క‌రోనా కేసులు

-

బ్రెజిల్ దేశంలో క‌రోనా వైర‌స్ రోజురోజుకూ తీవ్ర‌రూపం దాల్చుతోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు న‌మోదు అవుతున్నాయి. గ‌త 24గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 50,032 కేసులు న‌మోదు కాగా, 892మంది మ‌ర‌ణించారు. ఈ మేర‌కు ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ తాజాగా వివ‌రాల‌ను వెల్ల‌డించింది. ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం కేసుల సంఖ్య 35,82,362కు చేరుకుంది. ఇక క‌రోనాతో మ‌ర‌ణించిన వారి సంఖ్య 1,14,250కు చేరుకుంది.

corona

ఈ నేప‌థ్యంలో ఆ దేశ ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. కేసుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండ‌డంతో ఏం జ‌రుగుతుందోన‌ని బిక్కుబిక్కుమంటూ గ‌డుపుతున్నారు. ఇక పాజిటివ్ కేసుల సంఖ్య‌లో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. క‌రోనా వైర‌స్ పాజిటివ్ కేసుల్లో అగ్ర‌రాజ్యం అమెరికా మొద‌టి స్థానంలో, భార‌త్ మూడో స్థానంలో నిలిచాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు పాజిటివ్ కేసుల సంఖ్య‌ 23,35,9,690పైగా చేరుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version