దేశంలో మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్..?

-

దేశ వ్యాప్తంగా మరోసారి పూర్తి స్థాయిలో లాక్ డౌన్ ని విధించే అవకాశాలు ఉన్నాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. దేశంలో కరోనా కేసులు చాలా వేగంగా పెరుగుతున్నాయి. ప్రతీ రోజు కూడా పది వేలకు పైగా కేసులు గత వారం రోజుల్లో నమోదు అయ్యాయి. దీనితో ఇప్పుడు కేంద్రం కూడా కరోనా వైరస్ ని కట్టడి చేయకపోతే మాత్రం కరోనా వైరస్ తో పోరాటం చేయడం చాలా కష్టం అనే భావన లో ఉంది.

ఇక ఈ నేపధ్యంలోనే ప్రధాని నరేంద్ర మోడీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా మళ్ళీ సంపూర్ణ లాక్ డౌన్ విధించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ నెల 16 17 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల సిఎం లతో మాట్లాడే అవకాశం ఉంది. రాష్ట్రాల సిఎం లతో మాట్లాడి లాక్ డౌన్ ని మరో మూడు వారాల పాటు సంపూర్ణంగా విధిస్తే ఏ విధంగా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. లాక్ డౌన్ ని అమలు చేయడమే మంచిది అనే భావనలో కేంద్రం ఉంది.

అందుకే ఇప్పుడు మోడీ కూడా కేబినేట్ సమావేశం ఏర్పాటు చేసి పేదలకు మరో ప్యాకేజిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. అయితే ఢిల్లీ మహారాష్ట్ర సిఎంలు ఇప్పుడు లాక్ డౌన్ ని వద్దు అని చెప్తున్నారు. దీనిపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతుంది. ఇక లాక్ డౌన్ లేకపోతే మాత్రం కరోనా వైరస్ ని కట్టడి చేయడం సాధ్యం కాదు అని మోడీ ఇటీవల కొందరితో వ్యాఖ్యలు కూడా చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version