ఆంధ్రప్రదేశ్ లో టూరిస్ట్ లకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో గుడ్ న్యూస్ చెప్పే అవకాశం ఉంది. మార్చ్ తర్వాత మూతపడిన పర్యాటక కేంద్రాలను తెరిచే ఆలోచనలో ఉన్నారు. కేంద్ర హోం శాఖ మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను తిరిగి ప్రారంభించేందుకు సిద్ధమైంది పర్యాటక శాఖ. పర్యాటక ప్రాంతాలతో పాటు రోప్ వే, బోటింగ్ కార్యకలాపాలు, సాహస క్రీడలు, పర్యాటక రవాణా కార్యకలాపాలు ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసింది రాష్ట్ర పర్యాటక శాఖ.
టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెంట్లు కూడా యధావిధిగా కార్యకలాపాలు ప్రారంభించుకోవచ్చని స్పష్టం చేసింది ఏపీ సర్కార్. అటు చారిత్రక ప్రాంతాలు, పురావస్తు మ్యూజియంలను కూడా ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కోవిడ్ నిబంధనల్ని పాటిస్తూ పర్యాటక కార్యకాలాపాలు నిర్వహించుకోవాలని సూచిస్తూ ఆదేశాలిచ్చారు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ.