కుటుంబ కలహాలతో ఏఆర్ ఎస్సై ఆత్మహత్యకు పాల్పడ్డింది. ఈ ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రాలో గురువారం ఉదయం ఆలస్యంగా వెలుగుచూసింది. కుటుంబ కలహాల కారణంగానే ఏఆర్ ఎస్సై లక్ష్మి( 38) ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా..గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు.
పరీక్షించిన వైద్యులు అప్పటికే ఏఆర్ ఎస్సై చనిపోయినట్లు నిర్దారించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. లక్ష్మి మృతికి గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.