BREAKING : అవినాష్ రెడ్డి బెయిల్ పిటీషన్ పై విచారణ…

-

వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సిబిఐ ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. అయినా అవినాష్ రెడ్డి మాత్రం వివిధ కారణాలను చూపుతూ విచారణకు హాజరు కాకుండా సిబిఐకి మూడు చెరువుల నీళ్లు తాగిస్తున్నాడు. సిబిఐ ఒకవేళ అరెస్ట్ చేసినా బెయిల్ మీద బయటకు రావడానికి చాలా రోజులుగా ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హై కోర్ట్ లో పిటీషన్ వేసి ఉన్నాడు. అయితే ఈ పిటీషన్ పై పలు మార్లు విచారణ జరిగినా… ఇంకా తుది తీర్పు ఇవ్వకపోవడం గమనార్హం.

అయితే తాజాగా సుప్రీమ్ కోర్ట్ ఆదేశాల మేరకు ఈ తెలంగాణ హై కోర్ట్ వెకేషన్ బెంచ్ ఈ పిటీషన్ పై విచారణ జరుపుతోంది. ఈ విచారణలో అవినాష్ రెడ్డి మరియు సునీత తరపున లాయర్లు తమ వాదనలను వినిపించనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version