BREAKING : హై కమాండ్ పిలుపుతో రేపు ఢిల్లీకి బండి సంజయ్…

-

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కు బీజేపీ అధిష్టానం నుండి పిలుపు వచ్చింది. దీనితో రేపు హైద్రాబాద్ నుండి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ లో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉన్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో సొంత పార్టీలో నెలకొన్ని అసంతృప్తులు మరియు నేతల మధ్యన సఖ్యత లేకపోవడం లాంటి పలు అంశాలపైన చర్చించడానికి పిలుస్తున్నట్లు ప్రాధమిక సమాచారం. తెలంగాణాలో ఇప్పుడిప్పుడే కేసీఆర్ పార్టీపై ప్రజలలో పెరుగుతున్న వ్యతిరేకతను సొమ్ము చేసుకునే ప్రయత్నాల్లో బీజేపీ ముమ్మరంగా వర్క్ అవుట్ చేస్తోంది. ఇందులో భాగంగానే ముఖ్య నేతలను ఢిల్లీ కి పిలిపించుకుని మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

అయితే రాష్ట్రంలో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేలు ఎంతకైనా వెళుతున్న తరుణంలో పార్టీ తన ప్రభావాన్ని కోల్పోకుండా చేయడానికి బీజేపీ అధిష్ఠానము రేపు సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీలో ఈటల, బండి సంజయ్ మరియు ఇతర కేంద్ర నాయకులు ఉండనున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version