గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి ఇండియా మహిళల క్రికెట్ కోచ్ పదవి ఖాళీగా ఉన్నసంగతి తెలిసిందే. కొన్ని కారణాల వలన అప్పటి కోచ్ గా ఉన్న రమేష్ పవర్ ను బీసీసీఐ తీసివేసింది. అప్పటి నుండి హ్రిషికేష్ కనిత్కర్ కోచ్ గా ఉంటూ వచ్చాడు. ఇక తాజాగా బీసీసీఐ నిర్వహించిన ఇంటర్వ్యూ లలో దేశవాళీ క్రికెట్ లో టన్నులకొద్దీ పరుగులు చేసిన అమోల్ ముజుందార్ ను ముగ్గురు సభ్యులు గల సెలక్షన్ ప్యానెల్ ఏకపక్షముగా ఎంపిక చేసింది. ముజుందార్ తన కెరీర్ లో ఇండియా జాతీయ జట్టుకు ఆడింది లేదు.. కానీ ఫస్ట్ క్లాస్ కెరీర్ లో 171 మ్యాచ్ లు ఆడగా 11167 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు ఉన్నాయి. రంజీ ట్రోఫీ లో అత్యధిక పరుగులు సాధించిన వారిలో ముజుందార్ కూడా ఒకరు. ఇతను ముంబై కి ఎనిమిది రంజీ ట్రోఫీ టైటిల్స్ ను అందించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఇతను ఇండియా మహిళలకు హెడ్ కోచ్ గా పనిచేయనున్నాడు. మరి ఇతని సారథ్యంలో మరో రెండు సంవత్సరాలలో జరగనున్న టీ20 వరల్డ్ కప్ మరియు వన్ డే వరల్డ్ కప్ లను గెలిపిస్తాడా చూడాలి.