తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కు కరోనా పాజిటివ్ వచ్చింది. రెండు మూడు రోజులుగా గంగుల కమలాకర్ జలుబు, జ్వరంతో బాధపడుతున్నారు. దాంతో మంగళవారం కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. రెండు మూడు రోజుల నుండి తనను కలిసిన వారు కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకోవాలని గంగుల కమలాకర్ సూచించారు. గత కొద్ది రోజులుగా గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే.
టిఆర్ఎస్ నుండి హరీష్ రావు తో పాటు గంగుల కమలాకర్ హుజూరాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను తిప్పి కొడుతున్నారు. ఇలాంటి సమయంలో గంగుల కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇదిలా ఉంటే దేశం లో కరోనా కేసులు ఇప్పటికీ నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లకు సైతం పాజిటివ్ వస్తోంది. అయితే గతంలో మాదిరిగా సీరియస్ కేసులు నమోదు అవ్వడం లేదు.