పెళ్లంటే ఒక కొత్త వ్యక్తిని మన జీవితంలోకి ఆహ్వానించుకోవటమే. ఆ వ్యక్తివల్ల మన జీవితం చాలానే మారిపోతుంది. పెళ్లికి జాతకాలు, రాశులు వంటివి బాగా పట్టించుకుంటారు. అయితే కొన్ని రాశులు వాళ్లకు కొన్ని రాశులు పడవు. వాళ్ల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతాయట. అలాంటి రాశులవారు మీ జీవితంలోకి వస్తే ఇక మీ సంసారం ఎప్పుడూ గొడవల మయమే.ఎందుకు ఊరికే గొడవలు అవుతాయో తెలియదు.. అపార్థాలు వచ్చేస్తాయి. అయితే ఈ మూడు రాశుల అమ్మాయిలను పెళ్లిచేసుకుంటే అబ్బాయిలు మీరు అదృష్టవంతులే అంట.
ఆ జన్మ రాశులున్న మహిళలను పెళ్లి చేసుకుంటే జీవితానికి ఎదురే ఉండదని హిందూ పండితులు అంటున్నారు. వీటిలో మేష, కర్కాటక, సింహ రాశివారిని చేసుకోవాలని సూచిస్తున్నారు.
కర్కాటరాశి:
కర్కాటక రాశి మహిళల్లో అత్యధిక సంప్రదాయ లక్షణాలు ఉంటాయట. ఈ రాశి మహిళలు చాలా సున్నితంగా ఉంటారు. ఇతరులపై ఆధారపడి జీవనం సాగిస్తారు, అలాగే వీరిలో ఆరాధన భావంతోపాటు గ్రహణశక్తి కూడా ఎక్కువే. భర్తకు అనుకూలంగా ఉంటారట. వివాహ బంధాన్ని బలోపేతం చేయడానికే ప్రయత్నిస్తారు. ఏదేమైనా సరే భర్తతోనే చివరి క్షణం వరకూ ఉండాలనుకుటారు.
మేషరాశి
మేష రాశి స్త్రీలు భర్త అడుగు జాడల్లోనే నడుస్తారట. అలాగే మంచి సమర్థుడైన భర్త తనకు రావాలని కోరుకుంటారు. ప్రతి పనిలోనూ తమ ప్రత్యేకత కనిపిస్తుంది. తన భర్త, కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించడమే కాకుండా అందరూ కలిసుండాలని ఎప్పుడూ కోరుకుంటారు. తన బాధ్యతలను చక్కగా నేరవేరుస్తురాట. ఎప్పుడూ బాధ్యతల నుంచి పక్కకు తప్పుకోవాలని అనుకోరుట.
సింహరాశి
సింహరాశి వారు అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే పేరకు తగ్గుట్టుగానే చాలా సింహంలానే వారి వ్యక్తిత్వం ఉంటుంది. మహిళలు చాలా శక్తిమంతులుగా ఉంటారు. వీరు ఎదుటువారు వీరిని త్వరగా ఆకర్షిస్తారు.వీరు సెక్సీగా ఉంటారట. ఈ రాశి మహిళలు స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఎదుర్కొనే సత్తా ఉంటుంది. సొంత నిర్ణయాలు తీసుకుంటూ సమస్యలను పరిష్కరిస్తారు. ఈ రాశి మహిళలు మీ జీవితంలోకి వస్తే..మీరు లక్కీఛాన్స్ కొట్టినట్లే.
అర్థంచేసుకుని ఎప్పుడూ మనతో ఉండే భాగస్వామి కంటే మరి ఇంక అదృష్టం ఏం ఉంటుంది. ఎంత డబ్బులు ఉన్నా..ఒకవేళా మనకు వచ్చే భార్య అర్థంచేసుకునే మనస్తత్వం కాదంటే..ఇక విడాకులేనా పరిష్కారం.గమనిక: పై కథనం హిందూపండితులు చెప్పిన వాటిని ఆధారంగా చేసుకుని రాయబడింది కానీ, మనలోకం సొంతగా రాసింది కాదు.
-Triveni Buskarowthu