BREAKING: కృష్ణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల

-

సూపర్ స్టార్ కృష్ణ ఈరోజు తెల్లవారుజామున హైదరాబాదులోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఆయనకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. గుండెపోటుతో ఆయనకు మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ జరిగిందని భావిస్తున్నట్లు ఈ సాయంత్రం 6 గంటల తర్వాత హెల్త్ బులిటన్ లో వెల్లడించారు.

ఇందుకోసం 8 మంది డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందని తెలిపారు. డయాలసిస్ కూడా చేస్తున్నట్లు వివరాలు వెల్లడించారు. ఉదయం ఆరోగ్య పరిస్థితికి ఇప్పటికీ పోలిస్తే పరిస్థితి మరి కాస్త విషమంగానే ఉందని కాంటినెంటల్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తిరిగి మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకి హెల్త్ బుల్లెట్ ఉంటుందన్నారు. కృష్ణ ఆరోగ్యం పట్ల సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, ఆయన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version