BREAKING: “హిట్ మ్యాన్” రోహిత్ శర్మ (48) అవుట్ !

-

ఈ వరల్డ్ కప్ లో ఇప్పటికే ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ చాలా మెరుగైన ఆటతీరును కనబరుస్తూ టీం ను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నాడు. ఓపెనర్లు సరిగా ఆడి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే తరువాత వారికి భరోసా ఉంటుంది. ప్రతి మ్యాచ్ లోనూ అదే చేస్తూ టీం కు వెన్నెముకగా మారాడు రోహిత్ శర్మ. తాజాగా బాంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లోనూ రోహిత్ శర్మ ఛేజింగ్ చేయాల్సిన స్కోర్ ను త్వరగా చేరుకోవాలి అన్న ఐడియా తోనే బ్యాటింగ్ చేస్తున్నట్లు అనిపించింది. బౌలర్ల ఎవరన్నది చూడకుండా పడినబంతిని పడినట్లే ఫోర్ లేదా సిక్స్ మలుస్తున్నాడు. ఆ క్రమంలోనే హాసన్ మహమ్మద్ బౌలింగ్ లో సిక్సు కొట్టిన తర్వాత మళ్ళీ భారీ షాట్ కు ప్రయత్నించి శాంటోకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. జట్టు స్కోర్ 88 పరుగులు ఉన్న దశలో రోహిత్ శర్మ అవుట్ అయ్యాడు.

రోహిత్ 40 బంతులను ఎదుర్కొని 7 ఫోర్లు 2 సిక్సులతో 48 పరుగులు చేసి కొంచెంలో అర్ద సెంచరీ ని మిస్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజులో గిల్ మరియు కోహ్లీ లు ఉన్నారు.. వీరిద్దరో త్వరగానే మ్యాచ్ ను ముగించాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Exit mobile version