ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుల లో ఒకరు జీవీఎల్ నరసింహారావు. ఈ నేపథ్యంలో ఇటీవల సుప్రీంకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలలో ఇచ్చిన తీర్పు గురించి ఎన్నికల కోడ్ ఎత్తివేయడం దాని గురించి తనదైన శైలిలో వివరించడం జరిగింది. సుప్రీంకోర్టు ఎన్నికల కోడు ఎత్తివేయడం చాలా కరెక్ట్ పని అని ఈ తీర్పు మరోసారి ఎన్నికల సంఘానికి ఉండే అధికారాన్ని గుర్తు చేసిందని తెలిపారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా గాని జనసేన మరియు బీజేపీ పొత్తు రాజకీయాల గురించి కూడా జివిఎల్ నరసింహారావు మాట్లాడటం జరిగింది. స్థానిక ఎన్నికల సందర్భంగా జనసేన బీజేపీ కూటమి ఎన్నికల ప్రచారం నిమిత్తం బహిరంగ సభలు నిర్వహించడం లేదని కరోనా వైరస్ వలన భారీ సమావేశాలు నిర్వహించకూడదని నిర్ణయించుకున్నారట.
దీంతో ఈ వ్యాఖ్యలు పట్ల ఏపీ బీజేపీ నేతలు సీరియస్ అయి జీవీఎల్ పై హైకమాండ్ కి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతున్నారు. ఎక్కడ ఏది ఎలా మాట్లాడాలి అన్న దాని విషయంలో జీవీఎల్ కి క్లారిటీ లేదు అన్న చందంలో రిపోర్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారట. దీంతో కచ్చితంగా ఇది జీవీఎల్ కి ఊహించని బ్రేక్ న్యూస్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.