తెలంగాణకు చెందిన ఇండియన్ క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ కు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భారీ షాక్ తగిలింది. HCA0 ఓటర్ల జాబితా నుండి హాజరుద్దీన్ ను తొలగిస్తూ జస్టిస్ లావు నాగేశ్వర రావు కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ కారణంగా ఇప్పుడు మహమ్మద్ అజారుద్దీన్ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కు జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతను కోల్పోవడం జరిగింది. అయితే ఇతన్ని తొలగించడానికి ఏ కారణం అయి ఉంటుందా అని అందరూ ఆలోచిస్తున్న తరుణంలో, గతంలో HCA అధ్యక్షుడిగా ఉంటూనే డెక్కన్ బ్లూస్ కు ప్రెసిడెంట్ గా ఉంటూ వచ్చారని అనర్హత వేటును వేసినట్లు చెప్పారట. కాగా ఇండియా క్రికెట్ సభ్యుడిగా ఉన్నప్పటి నుండే అజారుద్దీన్ వివాదాలలో ఉన్నాడు..
ఆ తర్వాత చాలా వివాదాలతో జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాడని పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. మరి ఈ అనర్హత వేటుపై అజారుద్దీన్ ఏమైనా సంచలన నిర్ణయం తీసుకుంటారా ? అంటే కోర్టుకు వెళ్లడం లాంటివి ఏమైనా చేస్తారా అన్నది తెలియాల్సి ఉంది.