ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్

-

ఏపీ ఫైబర్ నెట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఏపీ హైకోర్ట్ తీర్పును రిజర్వ్ చేసింది. ఇరువర్గాల వాదనలు ముగియడంతో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘‘ స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో చంద్రబాబుకు సంబంధం లేదు. రెండేళ్ల తర్వాత రాజకీయ కారణాలతో కేసులో ఇరికించారు. డిజైన్ టెక్ సంస్థతో ఇతర సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. చంద్రబాబు సీఎం హోదాలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌కు నిధులు మాత్రమే మంజూరు చేశారు.

ఆ తరువాత ఒప్పందం ప్రకారం నలభై సెంటర్లను ఏర్పాటు చేశారు. రెండు లక్షల మందికి పైగా శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించారు. అంతా ఓపెన్‌గా జరిగితే ఇందులో స్కామ్ ఎక్కడుంది, చంద్రబాబు పాత్ర ఏముంది?. ఇది పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు. చంద్రబాబు అవినీతి చేసినట్లు ఆధారాలు కూడా చూపించలేదు. ఇప్పటికే కస్టడీలో చంద్రబాబు విచారణ అధికారులకు సహకరించారు. ఇక కస్టడీ కూడా అవసరం లేదు… అయినా విచారణ సాగదీయడానికే ఈ పిటిషన్ వేశారు. ఈ అంశాలను పరిశీలన చేసి బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నాం’’ అని ప్రమోద్ కుమార్ దూబే వాదించారు.

కాగా, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుడ్ని చేస్తారంటూ వారు ప్రశ్నించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని ఆరోపించారు. రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని లూథ్రా, అగర్వాల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడు ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చారని స్పష్టం చేశారు. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నిన్నటి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న కొంత మేర వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణ కొనసాగింపును నేటికి వాయిదా వేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version