తెలంగాణాలో నవంబర్ 30న ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలకమైన నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ నిర్ణయాలు అన్నీ కూడా రాష్ట్రంలో ప్రశాంతముగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించడానికి అని తెలిసిందే. ఇక తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం కరీంనగర్ జిల్లా కలెక్టర్ మరియు కమిషనర్ లపైన వేటు వేసింది. ఇది వరకు రాష్ట్రంలో పలు జిల్లాలలో ఉన్న అధికారులను బదిలీ పేరుతో వేరే వేరే ప్రాంతాలకు పంపించిన సంగతి తెలిసిందే. అదే విధంగా కరీంనగర్ కలెక్టర్ గోపిని మరియు కమిషనర్ సుబ్బారాయుడులను బదిలీ పేరుతో తరలించింది. కాగా కొత్తగా కరీంనగర్ కు వచ్చే అధికారులు ఎవరన్న విషయం పై ఇంకా స్పష్టత రాలేదు. త్వరలోనే వీరిని నియమించే విషయంపై ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికలలో స్థానికంగా వీరి ప్రభావం ఉంటుందేమోనని చిన్న సందేహంతో అన్ని చోట్ల అధికారులను బదిలీ చేస్తున్నారు.
ఇక ఎన్నికలకు కేవలం నెల మూడు రోజులు మాత్రమే సమయం ఉన్నహ్దున అన్ని పార్టీలు గెలుపు కోసం ప్రజలను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.