తెలంగాణాలో నవంబర్ 30న జరగనున్న ఎన్నికల్లో ఎలాగైనా గెలుపును దక్కించుకోవాలని మూడు పార్టీలు పోటీ పడుతున్నాయి. వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే అధికార పార్టీ BRS కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రజలు. కాగా కాంగ్రెస్ విజయభేరి బస్సు యాత్ర పేరుతో ప్రజల్లో మంచి స్పందన దక్కించుకుంది అని చెప్పాలి. ఇక తాజాగా కాంగ్రెస్ అధిష్టానం నుండి అందుతున్న సమాచారం ప్రకారం కాంగ్రెస్ రేపటి నుండి చివరి విడత విజయభేరి బస్సు యాత్రను స్టార్ట్ చేయనుంది. అందులో భాగంగాఆ రేపు తాండూరు , పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలను లక్ష్యంగా చేసుకుని యాత్రను కొనసాగించనున్నారు కాంగ్రెస్ నేతలు.
కాగా విశేషం ఏమిటంటే.. ఈ యాత్రలో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ పాల్గొనబోతున్నారు. ఆ తరువాత రోజున సంగారెడ్డి, నర్సాపూర్, మెదక్ లలో జరగనున్న బస్సు యాత్రలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే పాల్గొంటారు.