నాకు ప్రధానో, మంత్రో కావాలని లేదు.. కానీ : శరద్‌ పవార్‌

-

ఎన్సీపీలో తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడటం పక్కా అని శరద్ పవార్ అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన తన వయసుపై అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు. తనకు 83 ఏళ్ల వయస్సు ఉండటంతో క్రియాశీల రాజకీయాల నుండి తప్పుకోవాలని తన అన్న కొడుకు అజిత్ పవార్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను అలసిపోనని, రిటైర్ కానని… కార్యకర్తలు తనను పని చేయాలని కోరుకుంటున్నారని కౌంటర్ ఇచ్చారు.

‘మొరార్జీ దేశాయ్ ఏ వయసులో ప్రధాని అయ్యారో తెలుసా? నాకు ప్రధానమంత్రి లేదా మంత్రి కావాలని లేదు. కానీ ప్రజలకు సేవ చేయాలని మాత్రమే కోరుకుంటున్నాను’ అని పవార్ అన్నారు. తనకు పనిచేసే శక్తి ఉందని చెప్పారు. నేను అలసిపోను… రిటైర్ కూడా కాను.. అని అటల్ బిహారీ వాజపేయి మాటలను పవార్ ఉద్ఘాటించారు. తనను రిటైర్ కావాలని చెప్పడానికి అజిత్ ఎవరు? నేను ఇంకా పని చేయగలను అని శరద్ పవార్ వ్యాఖ్యానించారు.

మహారాష్ట్రలో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మంత్రివర్గంలో అజిత్ పవార్, మరో ఎనిమిది మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు చేరిన వారం తర్వాత ర్యాలీ నిర్వహించారు. 53 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలలో దాదాపు 40 మంది ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందని అజిత్ పవార్ చెప్పడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version