రాత్రిళ్ళు వీటిని అస్సలు తినద్దు.. నిద్రే పట్టదు..!

-

రాత్రిళ్ళు చాలా మందికి నిద్ర పట్టదు. రాత్రిపూట సరిగా నిద్రపోకపోవడం వలన అది మన ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుంది. రాత్రి పూట వీటిని తీసుకుంటే అసలు నిద్ర పట్టదు కాబట్టి వీటిని అసలు తీసుకోవద్దు. వీటిని తీసుకుంటే రాత్రిపూట నిద్ర పట్టదు మీరు ఇబ్బంది పడతారు పైగా నిద్ర పట్టకపోవడం వలన మీ ఆరోగ్యం పై కూడా ప్రభావం పడుతుంది. ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది.

 

రాత్రిపూట ఏ ఆహార పదార్థాలను తీసుకోకూడదని విషయానికి వచ్చేస్తే… కెఫీన్ సమృద్ధిగా ఉండే ఆహార పదార్థాలని రాత్రి పూట అసలు తీసుకోకూడదు. రాత్రిపూట కాఫీ వంటి వాటిని తీసుకుంటే నిద్ర సరిగా పట్టదు. ప్రశాంతంగా నిద్ర పోవడం కష్టంగా ఉంటుంది. కొన్ని ఎనర్జీ డ్రింక్స్ చాక్లెట్స్ వంటి వాటిలో కూడా కెఫీన్ ఎక్కువగా ఉంటుంది టి సోడాలో కూడా ఉంటుంది అటువంటి వాటిని తీసుకోకండి. రాత్రిపూట మసాలా కారం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటే గుండెలో మంట కలుగుతుంది. దాంతో నిద్ర పట్టదు. రాత్రిపూట స్పైసీ ఫుడ్ ని తీసుకుంటే యాసిడ్ రిఫ్లెక్స్ సమస్యలు కలుగుతాయి. కాబట్టి ఇటువంటి తప్పుల్ని కూడా చేయకండి.

అధిక ప్రోటీన్ ఉండే ఆహార పదార్థాలని రాత్రి పూట తీసుకోవడం వలన నిద్రకి భంగం కలుగుతుంది కాబట్టి అటువంటి వాటిని కూడా తీసుకోకండి. కొవ్వు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలని కూడా రాత్రిపూట తీసుకోవద్దు. కేక్, స్వీట్స్ వంటి వాటిని కూడా రాత్రి పూట తీసుకోవద్దు రాత్రిపూట తియ్యటి ఆహార పదార్థాలను తీసుకుంటే చక్కెర స్థాయిలో పెరిగిపోతాయి. చక్కెర అధికంగా ఉండే ఆహార పదార్థాలు రాత్రిళ్ళు తీసుకుంటే పీడకలలు నిద్రకి భంగం కలుగుతాయి. ఆల్కహాల్ ని రాత్రి తీసుకుంటే నిద్ర పట్టదు. సిట్రస్ ఫ్రూట్స్ ని కూడా రాత్రి పూట తీసుకోవద్దు వీటిని రాత్రిళ్ళు తీసుకుంటే అస్సలు నిద్రపోలేరు ఆరోగ్యం కూడా పాడవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version