కాసేపటి క్రితమే టీటీడీ పాలకమండలి కొన్ని కీలకమైన నిర్ణయాలను తీసుకుని ఉద్యోగులకు మరియు భక్తులకు శుభవార్తను అందించింది. ఈ మీటింగ్ లో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాలు ఏమిటన్నది చూస్తే, ఎప్పటినుండో చెబుతూ వస్తున్న విషయం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యూలరైజ్ చేస్తామని చెప్పింది, కానీ అర్హత ఉన్న వారినే చేస్తామంటూ చెప్పడం కొసమెరుపు. శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని అలిపిరి వద్ద నవంబర్ 23న నుండి ప్రారంభిస్తున్నారు. ఈ హోమంలో పాల్గొనే భక్తులు వెయ్యి చెల్లించాల్సి ఉంది అని టీటీడీ తెలిపింది. టీటీడీ ఉద్యోగులకు ఇంటి స్థలాలలు కేటాయించిన స్థలంలో రోడ్డు నిర్మాణం కోసం 25 .67 కోట్లు కేటాయించారు. టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ బహుమానంగా 15 వేలు, అదే విధంగా కాంట్రాక్టు ఉద్యోగులకు 6850 చెల్లించనున్నారు.
ప్రసాదాలు మరియు ఇతర ముడిసరుకులు నిల్వ ఉంచడానికి గో డౌన్ నిర్మాణం కోసం 11 కోట్లు కేటాయింపు. ఇంకా కొన్ని రోడ్డు మార్గాలను నిర్మించడానికి కూడా నిధులను కేటాయించింది టీటీడీ పాలకమండలి. రుయా హాస్పిటల్ లో టీబీ రోగుల కోసం కొత్త వార్డును నిర్మించనున్నారు. స్విమ్స్ లోనూ నూతన భవనాలను కొన్ని విభాగాల కోసం నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు.