BREAKING NEWS: కాంగ్రెస్ పార్టీలోకి రాములమ్మ!

-

తెలంగాణ రాజకీయాల్లో మరొక్క సంచలనం అని చెప్పాలి. ప్రముఖ సినీ నటి మరియు లేడీ ఫైర్ బ్రాండ్
మాజీ ఎంపీ విజయశాంతి కాసేపటి క్రితం వరకు బీజేపీలో ఉన్నారు. కానీ ఏమి జరిగిందో తెలియదు కానీ విజయశాంతి తన మనసును మార్చుకుని కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతన్నారు. కొన్ని రోజుల ముందు నుండి ఈ విషయంపై వార్తలు వస్తున్నా విజయశాంతి మౌనంగానే ఉంది. అందుకున్నట్లు గానే విజయశాంతి మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి నిర్ణయం తీసుకున్నారు. కాగా తాజాగా ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ప్రకటించారు. చాలా కమిట్మెంట్ ఉన్న లీడర్ గా విజయశాంతికి పేరుంది. కానీ పార్టీలో తనకే మంచి జరగనప్పుడు ప్రజలకు ఎలా మంచి చేయగలరు అన్న ఒకే ఒక్క కారణంతో బీజేపీని వీడనుంది విజయశాంతి.

సీట్ల కేటాయింపు నుండి విజయశాంతి బీజేపీలో అసంతృప్తిగా ఉంటూ వచ్చింది, అమిత్ షా మోదీ సభలకు కూడా హాజరు కాలేదు. బీజేపీ సైతం ఈమె వెళ్లడం కంఫర్మ్ అనుకుని పెద్దగా పట్టించుకోలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version