2 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలో హైడ్రా పని చేస్తుంది అని కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఇక హైడ్రాకు చైర్మన్ గా ముఖ్యమంత్రి ఉంటారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నాం. మా పరిధిలో 1025 చెరువులను గుర్తించాము. సర్వే ఆఫ్ ఇండియా నుండి ఇమేజ్ రికార్డులు సేకరించాము. శాటిలైట్ ఆధారంగా సేకరించిన డేటా కూడా మా వద్ద ఉంది. చెరువులు నింపి FTL పరిధి మార్చినా కూడా వాటిని గుర్చించేదుకు పని చేస్తున్నాం.
శాటిలైట్ ఏజెన్సీ లతో కూడా సమావేశం అవుతున్నాం. సమూహంగా ఇచ్చే ఫిర్యాదులను ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గతంలో ఎలా ఉండేది అనేది గుర్తిస్తున్నాం. హైడ్రా కేవలం డిమాలేషన్ కోసమే అన్నట్లు కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. హైడ్రా చేరువులు పునరుద్ధరణ చేస్తుందని త్వరలోనే నిరూపిస్తాం. 72 DRF టీమ్ లు అందుబాటులోకి రాబోతున్నాయి. చెట్లు పడిపోవడం, నీళ్ళు నిలవడం, ఫైర్ ఆక్సిడెంట్లు పై DRF పని చేస్తుంది. త్వరలో మాకు వెదర్ రాడార్ రాబోతుంది అని రంగనాథ్ పేర్కొన్నారు.