BREAKING : రజినీకాంత్ హెల్త్ బులిటెన్ విడుదల..!

-

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ అనారోగ్యంతో అక్టోబర్ 28న ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. రజినీకాంత్ చెన్నై లోని కావేరి హాస్పిటల్ లో చేరారు. కాగా తాజాగా వైద్యులు రజినీకాంత్ హెల్త్ బులిటెన్ ను విడుదల చేశారు. ప్రస్తుతం రజనీకాంత్ ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో రజినీకాంత్ ను డిశ్చార్జ్ చేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు వైద్యులు రజనీ కాంత్ కు కరోటిడ్ ఆర్టిడ్ రివాస్కులరైజేషన్ చికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు.

ఇదిలా ఉంటే రజనీకాంత్ సతీమణి మాత్రం నిన్న కేవలం హెల్త్ చెకప్ కోసమే ఆయన ఆసుపత్రిలో చేరారని మీడియాకు వెల్లడించారు. మరోవైపు రజనీ కూతురు ఆస్పత్రికి వెళ్లి తండ్రిని కలుసుకున్నారు. ఇదిలా ఉండగా రజినీకాంత్ ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. అంతే కాకుండా ప్రస్తుతం పలు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే రజనీ హీరోగా నటిస్తున్న పెద్దన్న సినిమా షూటింగ్ పూర్తి కాగా తాజాగా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ సినిమా ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version