త్రుణమూల్ కాంగ్రెస్ లో చేరిన ప్రముఖ టెన్నిస్ క్రిీడాకారుడు లియాండ్ పేస్

-

గోవాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ త్రుణమూల్ కాంగ్రెస్ స్పీడ్ పెంచింది. తాజాగా త్రుణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ గోవాలో పర్యటిస్తున్నారు. ఈక్రమంలోనే దీదీ సమక్షంలో త్రుణమూల్ కాంగ్రెస్ లో పలువురు ప్రముఖులు చేరుతున్నారు. ప్రముఖ టెన్నిస్ క్రీడాకారుడు లియాండ్ పేస్  టీఎంసీలో చేరారు. మమతా బెనర్జీ లియాండర్ పేస్ చేరిక గురించి మాట్లాడుతూ’ మా యంగ్ అండ్ స్వీట్ బ్రదర్ మాతో చేరారు. మాతో చేరినందుకు ధన్యవాదాలు‘ అంటూ వ్యాఖ్యానించింది. పార్టీలో చేర్చుకున్నందుకు దీదీకి ధన్యవాదాలు, దేశ నిర్మాణం కోసం మేం కలిసి పనిచేయబోతున్నాం అని లియాండర్ పేస్ అన్నారు. రానున్న గోవా ఎన్నికల్లో తమ మార్కును చాటేందుకు టీఎంసీ ఉవ్విళ్లూరుతోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో గోవాలో ఎన్నికలు రాబోతుండటంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు దీదీ సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతం గోవాలో బీజేపీ అధికారంలో ఉంది. గత ఎన్నికల్లో గోవాలోని మొత్తం 40 సీట్లకు గానూ 17 అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. గోమంతక్ పార్టీని కలుపుకుని అధికారాన్ని ఏర్పాటు చేసింది. ఇన్నాళ్లు పశ్చిమబెంగాాల్ కే పరిమితమైన త్రుణమూల్ కాంగ్రెస్ ప్రస్తుతం గోవాలో తన ముద్ర వేయాలనుకుంటోంది. ప్రస్తుతం దీదీ గోవాలో పర్యటిస్తున్నారు. పలువురు నాయకులను టీఎంసీలోకి ఆహ్వానిస్తున్నారు. కార్యకర్తలతో వరసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు దీదీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version