భారత్ లో సోషల్ మీడియా బ్యాన్ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. సాధారణంగా రాజకీయ నాయకులకు క్రేజ్ వచ్చేది సోషల్ మీడియాలో. ముఖ్యంగా ఇప్పుడు నేను సోషల్ మీడియా నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నాను అని చెప్తున్న ప్రధాని నరేంద్ర మోడికి సోషల్ మీడియా ద్వారానే యూత్ లో క్రేజ్ వచ్చింది.
అలాంటి సోషల్ మీడియా నుంచి ఆయన తప్పుకుంటున్నారు. సోషల్ మీడియా ద్వారానే ఆయన అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి పొందారు అనేది వాస్తవం. విదేశాల్లో కూడా మోడికి అభిమానులు ఉన్నారు అంటే సోషల్ మీడియా పుణ్యమే. అలాంటి సోషల్ మీడియాను ఆయన వద్దని అనడం ఆశ్చర్యం కలిగించింది. అయితే దీని వెనుక ప్రధాన కారణం మాత్రం మరోలా ఉందని అంటున్నారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత మోడికి క్రేజ్ పెరిగింది. అయితే పౌరసత్వ సవరణ చట్టం తర్వాత మూడు రాష్ట్రాల ఎన్నికల తర్వాత మోడీ మళ్ళీ ప్రధాని అవ్వడంపై అనుమానాలు వచ్చాయి. జాతీయ స్థాయిలో మోడీ తీరుపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. రాజకీయంగా మోడీ తో పాటుగా బిజెపి కూడా ఇబ్బంది పడుతుంది. ఢిల్లీ అల్లర్లు ఇప్పుడు విపక్షాలు చేశాయని మోడీ అంటున్నా కాదు బిజెపి చేసింది అని విపక్షాలు అంటున్నాయి.
అక్కడ ఉన్న పరిస్థితులు జడ్జి ని బదిలీ చేయడం వంటివి అన్నీ కూడా మోడీ వైపే వేళ్ళు చూపిస్తున్నాయి. బిజేపినే దీనికి ప్రధాన కారణమని అంటున్నారు. పౌరసత్వ సవరణ చట్ట౦ విషయంలో అన్ని విధాలుగా బిజెపి మీద విపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా ఉన్నాయి. బిజెపి ఎంపీలు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు. రాజకీయంగా ఇబ్బంది పడటంతోనే మోడీ సోషల్ మీడియా నుంచి వెళ్ళిపోవాలని, తన గురించి, తన పార్టీ గురించి ప్రజల్లోకి ప్రచార౦ బాగా వెళ్తుంది అనే భావనలో మోడీ ఉన్నారు.