ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదు అనే మాట వినబడొద్దు : సీఎం రేవంత్

-

సచివాలయంలో రీజనల్​ రింగ్​ రోడ్డు, ఆర్​ అండ్​ బీ, నేషనల్​ హైవే ప్రాజెక్టులపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష ముగిసింది. ఇందులో రీజనల్​ రింగ్​ రోడ్ కు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించిన సీఎం.. నాగ్ పూర్-విజయవాడ కారిడార్ కు సంబంధించి తెలంగాణ జిల్లాల్లో అసంపూర్తిగా మిగిలిన భూసేకరణ ప్రక్రియను సంక్రాంతిలోగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అటవీశాఖ పరిధిలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలన్న సీఎం.. అటవీశాఖ, ఆర్ అండ్ బీ శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్లాలని, రెండు శాఖల్లో ఒక్కో అధికారిని ఇందుకు ప్రత్యేకంగా నియమించాలని సూచించారు.

రెండు శాఖలు సమావేశమై సంబంధిత శాఖల పరిధిలోని భూసేకరణ ప్రక్రియను వేగంగా పూర్తి చేయాలని ఆదేశించిన సీఎం .. రాష్ట్రంలో ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రోడ్డు వెడల్పు ఉండే విధంగా డిజైన్ చేయాలని సూచించిన సీఎం.. కొత్త గ్రామపంచాయతీలతో సహా ప్రతీ గ్రామం నుంచి మండల కేంద్రానికి బీటీ రోడ్డు ఉండాల్సిందే. ఇందుకు సంబంధించి విడతల వారీగా నిధులు విడుదల చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.. ఇక ఏ గ్రామానికి రోడ్డు లేదు అనే మాట వినబడొద్దు అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version