ప్రముఖ ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ సేవలు నిలిచిపోయాయి. ఈరోజు మధ్యాహ్నం నుంచి ఎస్బీఐ ఏటిఎం లు పని చెయ్యలేదు. అంతే స్టేట్ బ్యాంక్ కు సంభంధించిన అన్నీ కూడా పని చేయలేదు. యోనో యాప్..యుపిఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు కూడా పని చెయ్యక పోవడంతో బ్యాంక్ కస్టమర్లు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. చాలావరకూ ముఖ్యమైన లావాదేవీలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.. దాంతో జనాలు ఏం చెయ్యలేని పరిస్థితి కనిపిస్తుంది. ఈ సమస్య ఎప్పటివరకు ఉంటుంది.. అసలు ఈరోజు అవుతుందా.. ఇంకా సమయం పడుతుందా అనే విషయం పై బ్యాంక్ అధికారులు స్పష్టత ఇవ్వలేక పోతున్నారు..
దీని గురించి అధికారికంగా ప్రకటన వచ్చేవరకు కస్టమర్లకు ఈ తిప్పలు తప్పెలా లేవు..జూలై 1 నుంచి బ్యాంకింగ్ సేవలు పూర్తిగా మారిపోనున్న సంగతి తెలిసిందే..ఈ మేరకు ఇప్పటికే పలు నియమాలను కూడా అమలు చేస్తున్నారు..కొన్ని బ్యాంకులు మారిన నియమాల పై కస్టమర్లకు అవగాహాన కల్పిస్తున్నారు..