తీన్మార్ మల్లన్న మరోసారి అరెస్ట్ అయ్యారు. ఇటీవలే మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ చంచల్ గూడ జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే మల్లన్న ను మరోసారి పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ కల్లు వ్యాపారి వద్ద నుండి మల్లన్న టీమ్ డబ్బులు డిమాండ్ చేశారు అన్న ఆరోపణలతో అతడితో పాటు మరో ఐదుగురిపై నిజామాబాద్ జిల్లా ఎడపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
నిన్న రాత్రి మల్లన్న ను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు. కాగా మల్లన్న కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఒక మళ్ళీ పోలీసులు మల్లన్న ను అరెస్ట్ చేసి చంచల్ కూడా జైలుకు తరలించారు. ఇదిలా ఉండగా మల్లన్న తన ఛానల్ క్యూ న్యూస్ ద్వారా టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కావాలనే కేసీఆర్ ప్రభుత్వం మల్లన్నపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేసిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.